Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. యూపీఐ లావాదేవీలు, నెట్ బ్యాంకింగ్, అధికారిక యోనో యాప్.. వినియోగంలో సమస్యలు తలెత్తుతున్నట్లు పలువురు కస్టమర్లు సోషల్ మీడియా వేదికగా తమ అసౌకర్యాన్ని తెలియజేశారు. ఔటేజ్ ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్ డిటెక్టర్ ఇండియా సైతం ఎస్బీఐ కస్టమర్లు సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. ఈరోజు ఉదయం దాదాపు 9 గంటల నుంచి కస్టమర్ల ఫిర్యాదులు ప్రారంభమైనట్లు తెలిపింది. కొంత మంది మాత్రం ఆదివారం నుంచే తాము సమస్య ఎదుర్కొంటున్నట్లు ట్విటర్లో రాసుకొచ్చారు. మరికొందరైతే రెండు, మూడు రోజుల నుంచి తాము ఎస్బీఐ ఆన్లైన్ లావాదేవీల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.