Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇండోర్: శ్రీరామనవమి వేడుకల్లో వహనం నిర్వహిస్తుండగా 50 అడుగుల మెట్ల బావి పైకప్పు కూలి 35 మంది దుర్మరణం పాలైన ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఘటన చోటుచేసుకున్న బలేశ్వర్ జూలేలాల్ మహదేవ్ ఆలయంలోని అక్రమ కట్టడాన్ని స్థానిక అధికార యంత్రాంగం భారీ పోలీసు భద్రత మధ్య సోమవారంనాడు కూల్చివేసింది. విగ్రహాలను మరో మంందిరానికి తరలించింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అదేశాలతో సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆలయ ఆవరణలో పోలీసు భద్రత మధ్య ఈ కూల్చివేతల ప్రక్రియ మొదలైంది. ఆలయ ప్రాంగణంలో 10,000 చదరపుటడుగుల భూమి ఆక్రమణకు గురైనట్టు అధికారులు చెబుతున్నారు. కూల్చివేతలకు స్థానికుల నుండి ఎలాంటి నిరసనలు, అవాంతారాలు తలెత్తకుండా పోలీసు బలగాలను మోహరించారు. విగ్రహాలను కాంతఫాడ్ ఆలయానికి తరలించి యథాప్రకారం పూజాదికాలు నిర్వహించారు.