Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని సీబీఐ కోర్టు ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించింది. మద్యం పాలసీ వ్యవహారంలో ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియా సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దాదాపు ఎనిమిది గంటలకుపైగా విచారించిన ఆయనను అరెస్టు చేసినట్లు సీబీఐ ప్రకటించింది. ఆ తర్వాత ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది.
ఆ తర్వాత సీబీఐ కస్టడీకి ఇచ్చింది. విచారణ అనంతరం ఆయనను జ్యుడీషియల్ కస్టడీపై జైలుకు పంపింది. ఇదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సైతం అరెస్టు చేసింది. ఈడీ కేసులో మనీశ్ సిసోడియా బెయిల్ కోసం దరఖాస్తు చేయగా ఈ నెల 5న విచారణ జరుగనున్నది. మనీష్ సిసోడియా కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది. దర్యాప్తు సంస్థ వాదనలు విన్న కోర్టు కస్టడీని పొడిగించింది.