Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ పాఠశాల-1లో సోమవారం ఉదయం తెలుగు ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో రేపటి పరీక్ష వాయిదా వేసినట్లు సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ స్పందించింది. రేపటి పదో తరగతి పరీక్ష వాయిదా పడలేదని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. రేపట్నుంచి ఈ నెల 13వ తేదీ వరకు అన్ని పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.