Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - లఖ్నవూ
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ మేనకా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాడిద పాలతో చేసిన సబ్బు మహిళల శరీరాన్ని అందంగా ఉంచుతుందన్నారు. ఉత్తర్ప్రదేశ్ లోని సుల్తాన్పుర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. క్లియోపాత్ర ఆమె ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాణి. ఆమె తరచూ గాడిద పాలతో స్నానం చేసేది.
ఢిల్లీలో ఆ పాలతో తయారయ్యే సబ్బులు ఒక్కొక్కటి రూ.500 ధర పలుకుతున్నాయి. మనమెందుకు మేక, గాడిద పాలతో తయారీని ప్రారంభించకూడదు..? అని ఆమె మాట్లాడిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. లద్దాఖ్ కమ్యూనిటీ ఒకటి సబ్బుల తయారీలో గాడిద పాలను ఉపయోగిస్తోందన్నారు.