Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ లో ఈ రోజు చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జయింట్స్ ల మధ్యన మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణిత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 217 పరుగుల భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై ఆరంభం నుంచి ఓపెనర్లు దూకుడుగా ఆడారు. గైక్వాడ్ (57) మరో అద్భుత బ్యాటింగ్ అర్ధ సెంచరీ చేశాడు. మరో ఓపెనర్ కాన్వే (47) పరుగులు చేశాడు. దూబే (27) మోయిన్ ఆలీ (19) పరుగులు చేయగా అంబటి రాయుడు (14 బంతుల్లో 27) చివరి వరకు క్రీజులో ఉండి స్కోరును పెంచాడు. ఇక చివర్లో వచ్చిన ధోని రెండు భారీ సిక్స్ లతో అలరించాడు. మూడో బంతికి భారీ షాట్ ఆడగా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.