Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కనువిప్పు కార్యక్రమంలో ఎస్ఐ ప్రవీణ్ రాజ్ సూచన
-రుణాలందించే ఆప్ లకు యువత దూరంగ ఉండాలని హెచ్చరిక
నవతెలంగాణ-బెజ్జంకి
సముద్రంలో ఆటు పోట్లు ఎంత సహజమైనవో..మానవ జీవితంలో కష్టాలు సుఖాలు అంతే సహజమైనవని.. మానవుల జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని ఎస్ఐ ప్రవీణ్ రాజ్ ప్రజలకు సూచించారు.సోమవారం మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయితీ కార్యలయం వద్ద పోలిస్ కళజాత బృందం అద్వర్యంలో మూడ నమ్మకాలు,సైబర్ నేరాలు,సామాజిక మాద్యమాలు,అభరణాల అపహరణ, బాల్య వివాహలు,ఆత్మహత్యల నివారణ వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించడానికిఃకనువిప్పు కార్యక్రమంః నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఐ ప్రవీణ్ రాజ్ మాట్లాడుతూ చట్టాలు,పోలిసుల విధులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగియున్నప్పుడే నేరాలను కట్టడి చేయడానికి శాయశక్తుల కృషి చేస్తామన్నారు.అత్యాదునిక అధునిక సాంకేతిక పరిజ్ఞానం విసృతంగా అందుబాటులోకి వచ్చిన అనంతరం కూడా ప్రజలు మూడనమ్మకాలను నమ్ముతూ మోసపోతున్నారన్నారు.రుణాలందించే ఆప్ లకు యువత దూరంగ ఉండాలని హెచ్చరించారు.రాష్ట్ర పోలిస్ శాఖ అందిస్తున్న డయల్ 100,షీ టీమ్స్,బ్లూ కోల్ట్ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.నేరాల నియంత్రణకు సీసీ కెమేరాలు కీలకమని..దుకాణాల యాజమానులు విధిగా సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.సర్పంచ్ ద్యావనపల్లి మంజుల,వార్డ్ సభ్యులు,పోలిస్ స్టేషన్ సిబ్బంది,గ్రామస్తులు హజరయ్యారు.