Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాన - ముంబై
నేటి కాలంలో యువకులు మరీ రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న తీరును ప్రతి రోజూ సోషల్ మీడియా పుణ్యమాని ఎన్నో ఉదాహరణలు చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా బైక్ రేస్ లు చాలా ఎక్కువ అయ్యాయి. చాలా సందర్భాల్లో కొత్త కొత్తగా చేసే బైక్ స్టంట్ ల వలన వారి ప్రాణాలకే ముప్పు జరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులుగా అలాంటి ఒక బైక్ స్టంట్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
అసలు విషయానికి వెళ్తే ఈ వీడియో లో ఒక యువకుడు ఇద్దరు అమ్మాయిలను ముందు ఒకరు వెనుక మరొకరిని కూర్చుని పెట్టుకుని ఫ్రంట్ వీల్ ను ఫుల్ గా పైకి లిఫ్ట్ చేసి దాదాపుగా 100 కేఎంపీహెచ్ స్పీడ్ తో ముంబై రోడ్ లలో డ్రైవ్ చేశాడు. పైగా ఈ వీడియోను సోషల్ మీడియాలో సదరు యువకుడు పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. కానీ ఈ వీడియోను చూసిన ముంబై సిటీ పోలీసులు వెంటనే కేసును నమోదు చేసి ఆ యువకుడు మరియు ఆ ఇద్దరు అమ్మాయిలపై ముంబై బీకేసీ పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 308 కింద హత్యాయత్నం కేసును నమోదు చేశారు. బైక్ ను నడిపిన వ్యక్తిని ఫయాజ్ గా పోలీసులు గుర్తించారు. కాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ వీడియో ను తీసింది గత సంవత్సరంలో అని తేలింది.