Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి: బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీఈసెట్-2023 ప్రవేశ పరీక్షను మే 5న జేఎన్టీయూ-కాకినాడ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణల్లో నిర్వహించనున్నట్లు ఈసెట్ చైర్మన్, జేఎన్టీయూ-కే ఉపకులపతి ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు తెలిపారు. అపరాధ రుసుము లేకుండా ఈనెల 10 వరకూ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సోమవారం ఓ ప్రకటనలో సూచించారు. అభ్యర్థులకు సందేహాలుంటే 8500404562 ఫోన్ నంబరులో సంప్రదించాలన్నారు.