Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఛత్తీస్గఢ్
పెండ్లికి బహుమతిగా వచ్చిన హోం థియేటర్ పేలి.. నవ వరుడు, ఓ బంధువు మృతి చెందిన విషాదకర ఘటన ఛత్తీస్గఢ్లో చోటుచేసుకుంది. కబీర్ధామ్ జిల్లా చమరి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని హేమేంద్ర మేరవిగా పోలీసులు గుర్తించారు. హేమేంద్రకు రెండు రోజుల క్రితమే పెండ్లి జరిగింది. ఆ పెళ్లిలో అతడికి ఓ హోం థియేటర్ బహుమతిగా వచ్చింది. ఆదివారం హేమేంద్ర దాన్ని బయటకు తీసి విద్యుత్తు కనెక్షన్ ఇచ్చాడు, వెంటనే హోం థియేటర్ పేలిపోయింది. దీంతో హేమేంద్ర, అతని బంధువు అక్కడికక్కడే మృతి చెందారు.మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.