Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
ఢిల్లీ-ఎన్సీఆర్తోపాటు పలు రాష్ట్రాల్లో మంగళవారం రెండో రోజు ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు తీవ్రతతో కూడిన భారీ వర్షం ఢిల్లీ, ఎన్‌సిఆర్‌లో మంగళవారం రాబోయే కొన్ని గంటలపాటు కురుస్తుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది.ఉత్తరప్రదేశ్‌లోని బరౌత్, షికర్పూర్, ఖుర్జా, గంగోహ్, షామ్లీ, ముజఫర్‌నగర్, కంధ్లా, ఖతౌలీ, సకోటి తండా, దౌరాలా, బాగ్పట్, మీరట్, ఖేక్రా, మోదీనగర్, కిథోర్, గర్హ్ముక్తేశ్వర్, పిలక్ముక్తేశ్వర్ ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు తీవ్రతతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు.
హపూర్, గులాయోటి, సియానా, సికింద్రాబాద్, బులంద్‌షహర్, జహంగీరాబాద్, అనుప్షహర్, బహజోయి, పహాసు, దేబాయి, నరోరా, గభానా, సహస్వాన్, జట్టారి, అత్రౌలీ, ఖైర్, అలీఘర్, కస్గంజ్, నంద్‌గావ్, ఇగ్లాస్, సికంద్ర రావ్, బర్సానాస్, బర్సానాస్, మధుర ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కోరారు.హర్యానాలోని గన్నౌర్, మెహం, తోషమ్, రోహ్తక్, భివానీ, కర్నాల్, అసంద్, సఫిడాన్, పానిపట్, గోహనా, సోనిపట్, ఖర్ఖోడా, పల్వాల్, ఔరంగాబాద్,హోడల్లలో కూడా వర్షాలు కురుస్తాయని ఎంఎండీ అంచనా వేసింది.