Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ: రాష్ట్రంలో ముందుగానే నవంబరు, డిసెంబరులలో ఎన్నికలు జరగడం ఖాయమని.. అందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉండాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. తన ముఖం చూసే ప్రజలు ఓటేశారని, తన ఫొటో పెట్టుకునే ఎమ్మెల్యేలు గెలిచారని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్.. ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఢిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శాసనమండలి పట్టభద్రుల స్థానాల ఎన్నికలను ప్రామాణికంగా తీసుకుంటే పులివెందులలోనే టీడీపీ అభ్యర్థి రామగోపాల్‌రెడ్డి అత్యధికంగా ఓట్లు వచ్చాయని వివరించారు. పులివెందులలో తమ పార్టీ పరిస్థితిపై తక్షణం సమీక్షించాల్సి ఉందన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పులివెందులలో పోటీ చేయాలని మాజీ మంత్రి పేర్ని నాని సవాలు విసరడం విడ్డూరమని పేర్కొన్నారు. పులివెందులలో అధికార పార్టీని ఓడించడానికి బీటెక్ రవి సరిపోతారనే ధీమాలో ప్రతిపక్షం ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో మాస్టర్‌ప్లాన్‌కు భిన్నంగా కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్ల అభ్యర్థనతో 24 గంటల్లో 1,130 ఎకరాలను జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీకి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి కేటాయించడం ఆశ్చర్యకరమని ఎంపీ పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో రైతుల మరణాలన్నీ తమ ప్రభుత్వ హత్యలేనని నిందించారు. విశాఖలో వేల ఎకరాలను కబ్జా చేశారని, ఆ భూములను పేదలకు పంచాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు సూచించారు.