Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. సోమవారం హస్తినకు చేరుకున్న పవన్.. కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, మురళీధరన్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గానూ ఉన్న మురళీధరన్‌తో పవన్ మరోసారి భేటీ అయ్యారు. మంగళవారం మురళీధరన్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై పవన్ చర్చిస్తున్నట్లు సమాచారం. జనసేనానితో పాటు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా చర్చల్లో పాల్గొన్నారు.