Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వాషింగ్టన్
ట్విటర్ లోగోలో తొలి నుంచి ఉన్న బ్లూ బర్డ్ బదులుగా క్రిప్టో కరెన్సీ అయిన డోజీకాయిన్’కు సంబంధించిన డోజీ మీమ్‌ను ఉంచారు. మంగళవారం వేకువజామున ట్విటర్ యూజర్లకు ఈ కొత్త లోగో దర్శనమిచ్చింది. వెంటనే చాలా మంది ఈ మార్పును సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీన్ని ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ సైతం ధ్రువీకరించారు. బ్లూ బర్డ్ ఇక పాతదని ఇకపై ఈ డోజీ మీమే కొత్త లోగో అని ఉన్న ఓ మీమ్‌ను ట్వీట్ చేశారు. అలాగే 2022 మార్చి 26న ఓ ట్విటర్ యూజర్‌తో జరిపిన సంభాషణకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా ఈ సందర్భంగా మస్క్ పంచుకున్నారు. అందులో సదరు యూజర్ ట్విటర్‌ను కొనుగోలు చేసి ‘డోజీ’ని లోగోగా పెట్టాలని సూచించడం గమనార్హం. ఈ తరుణంలో ఆ సంభాషణను గుర్తు చేస్తూ.. ‘ఇచ్చిన మాట ప్రకారం మార్పు చేసినట్లు పేర్కొన్నారు. అయితే, కొంత మందికి ఈ లోగో కేవలం ట్విటర్ డెస్క్‌టాప్ వెర్షన్లో మాత్రమే మారింది. మొబైల్/యాప్‌లో మాత్రం ఇంకా బ్లూ బర్డ్ లోగోనే కనిపిస్తోంది.