Stone pelting from Masjid towards #RamNavami rally at Rishra, Hooghly today. pic.twitter.com/HByHpER7cW
— Dilip Ghosh (@DilipGhoshBJP) April 2, 2023
Authorization
Stone pelting from Masjid towards #RamNavami rally at Rishra, Hooghly today. pic.twitter.com/HByHpER7cW
— Dilip Ghosh (@DilipGhoshBJP) April 2, 2023
నవతెలంగాణ - హౌరా
పశ్చిమ బెంగాల్లో మరోసారి హింస చెలరేగింది. హూగ్లీ జిల్లాలో సోమవారం రాత్రి ఉద్రిక్తత ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఈస్ట్రన్ రైల్వేలోని హౌరా-బుర్దవాన్ డివిజన్ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శ్రీ రామ నవమి ఊరేగింపు సమయంలో ఆదివారం రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి 10.30 నిమిషాల సమయంలో రిష్రా రైల్వే స్టేషన్ వద్ద కొందరు నాటు బాంబుల్ని విసిరేశారు. రైల్వే ట్రాక్‌పై నుంచి వెళ్తున్న కొన్ని రైళ్లపై కొందరు రాళ్లు విసిరారు. స్టేషన్ సమీపంలో ఓ వాహనానికి నిప్పు పెట్టారు. హింస వల్ల హౌరా రైల్వే స్టేషన్లో వేలాది మంది ప్రయాణికులు నిలిచిపోయారు. రిష్రాలో శ్రీ రామనవమి ర్యాలీపై రాళ్లు రువ్వుతున్న వీడియోను దిలీప్ ఘోష్ తన ట్విట్టర్లో పోస్టు చేశారు.