Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఝార్ఖండ్
ఝార్ఖండ్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తన 12వ భార్యను కర్రతో దారుణంగా కొట్టి చంపాడు ఓ వ్యక్తి. గయాన్ పోలీస్స్టేషన్ పరిధిలోని జామ్దార్ పంచాయితీ తారాపుర్ గ్రామానికి చెందిన రామచంద్ర, సావిత్రీదేవి భార్యభర్తలు. ఆదివారం రాత్రి.. రామచంద్ర ఇంట్లో మద్యం తాగుతున్నాడు. అదే సమయంలో భార్య సావిత్రీదేవితో అతనికి గొడవ జరిగింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన రామచంద్ర.. భార్యపై కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ సావిత్రీదేవి.. అక్కడికక్కడే మృతి చెందింది. ‘‘నిందితుడు రామచంద్రకు ఇప్పటి వరకు 12 పెళ్లిళ్లు అయ్యాయి. సావిత్రీ దేవి 12వ భార్య. ఆమెకు ఇది వరకే పెళ్లైంది. రామచంద్రతో గొడవ పెట్టుకుని మిగతా 11 మంది భార్యలు అతణ్ని విడిచిపెట్టి వెళ్లారు.