Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబై
2011 వన్డే వరల్డ్ కప్‌ను ఇండియా గెలిచిన విషయం తెలిసిందే. ఆ టోర్నీ ఫైనల్లో కెప్టెన్ ధోనీ కొట్టిన సిక్సర్ కూడా అందరికీ గుర్తుండిపోయే విషయమే. అయితే ఆ బంతి వెళ్లి వాంఖడే స్టేడియం లో ఓ సీటుపై పడింది. ఆ సీటుకు ఇప్పుడు ధోనీ పేరును పెట్టనున్నట్టు ముంబై క్రికెట్ సంఘం ప్రెసిడెంట్ అమోల్ ఖేల్ ఈ విషయాన్ని తెలిపారు. ఈ తరుణంలో పేరు ఆవిష్కరణ కార్యక్రమం కోసం ధోనీని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వాంఖడే స్టేడియంలో కొన్ని స్టాండ్స్‌కు సచిన్, గవాస్కర్, విజయ్ మర్చంట్ పేర్లు ఉన్నాయి. కొన్ని గేట్లకు ఉమ్రిగర్, వినూ మన్కడ్ పేర్లు పెట్టారు.