Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో నాంపల్లిలోని టీజేఎస్ పార్టీ కార్యాలయంలో బేటీ అయ్యారు. ఈ తరుణంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు కలసి పోరాటంపై చర్చలు జరిపినట్లు సమాచారం.
ఈ సందర్బంగా షర్మిల మాట్లాడుతూ నిరుద్యోగ సమస్య యువతను పట్టి పీడిస్తోందన్నారు. టి సేవ్ ఫోరం పేరుతో అందరం కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు భరోసా కోసమే టి సేవ్ ఫోరమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. షర్మిల వ్యాఖ్యలపై కోదండరాం సానుకూలంగా స్పందించారు. పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతానన్నారు. ఇదే క్రమంలో కోదండరాం మాట్లాడుతూ నిరుద్యోగుల తరపున కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరితో కలిసి పోవాలనేది తమ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఎవరితో కలిసి ఎలా పోరాటంలో ముందుకు వెళ్ళాలనేది రాష్ట్ర కమిటీలో చర్చించుకుంటామన్నారు. రాష్ట్రంలో పేపర్ల లీకేజీ విద్యార్థుల్లో గందరగోళం నెలకుంటోందన్నారు.