Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూయార్క్
హష్ మనీ కేసులో నేడు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోర్టు విచారణకు హాజరుకానున్నారు. అయితే ఆ సమయంలో మీడియాకు ఎంట్రీ ఇవ్వలేదు. ట్రంప్ విచారణను ప్రసారం చేసేందుకు కూడా సుప్రీంకోర్టు జడ్జి జువాన్ మర్చంట్ అంగీకరించలేదు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కు లక్షా 30 వేల డాలర్ల డబ్బు ఇచ్చిన ట్రంప్‌పై ఆ కేసులో నేరాభియోగాలు నమోదు అయ్యాయి. అయితే 76 ఏళ్ల ట్రంప్ ఆ కేసులో ఇవాళ ప్రత్యక్షంగా విచారణకు హాజరుకానున్నారు. ఈ తరుణంలో కేవలం అయిదు స్టిల్ ఫోటోలను మాత్రమే తీసుకునేందుకు అవకాశం ఇవ్వనున్నారు.