Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బాలీవుడ్ హీరో సల్మాన్ కి ఉన్న మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'కిసీ కా భాయ్ .. కిసీ కి జాన్' ఈ నెల 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగానే ఈ సినిమా నుంచి ఒక మాస్ సాంగ్ ను వదిలారు. 'ఏంటమ్మా ఏంటమ్మా' అంటూ సాగే ఈ పాటను సల్మాన్ .. వెంకీ .. పూజ హెగ్డే బృందంపై చిత్రీకరించారు. తెలుగు .. హిందీ భాషలను మిక్స్ చేసి వదిలిన పాట ఇది. పాయల్ దేవ్ కంపోజ్ చేసిన ఈ పాట మాస్ బీట్ తో నడుస్తుంది. తమిళ సంప్రదాయాన్ని టచ్ చేస్తూ ఈ పాట కొనసాగడం విశేషం. ఈ పాట మధ్యలో చరణ్ ఎంట్రీ ఇచ్చి .. మాస్ స్టెప్పులతో సందడి చేశాడు. అటు వెంకీ .. ఇటు చరణ్ ఇద్దరూ కూడా సల్మాన్ కి మంచి స్నేహితులు కావడం విశేషం.