Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వరంగల్
తెలంగాణలో ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం కలకలం రేపుతున్న వేళ తాజాగా మొదలైన పదో తరగతి పరీక్షల్లోనూ పేపర్లు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో హిందీ క్వశ్చన్ పేపర్ సైతం వాట్సాప్ గ్రూప్లో చక్కర్లు కొట్టడం తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తించింది.
ఈ క్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పేపర్ బయటకు వచ్చిన అంశంపై సైబర్ క్రైమ్ దర్యాప్తు కొనసాగుతోందని, సాయంత్రంకల్లా అసలు విషయం తేలుతుందని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. పేపర్ బయటకు వచ్చిన విషయం మీడియా ద్వారానే మాకు తెలిసింది. ఎగ్జామ్ ప్రారంభమైన గంట తర్వాత పేపర్ వాట్సాప్ గ్రూప్ ద్వారా బయటకు వచ్చింది. అంటే దాదాపు సగం పరీక్ష అయ్యాక వచ్చిందన్నమాట!. కాబట్టి దీనిని లీక్ అనడం సరికాదు. పరీక్ష మధ్యలో ఉండగానే పేపర్ బయటకు వచ్చిందనే మేం భావిస్తున్నాం. ఒక మీడియా ఛానెల్ మాజీ రిపోర్టర్ ద్వారా పేపర్ సోషల్ మీడియాలోకి వచ్చిందని తేలింది. అయితే.. అతనికి ఎక్కడి నుంచి వచ్చిందనేది తేలాల్సి ఉంది. బహుశా ఇన్విజిలేటర్ ఫోన్ లోపలికి తీసుకెళ్లడం వల్లే పేపర్ బయటికి వచ్చిందని భావిస్తున్నాం అన్నారు.