Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ విషాద ఘటన ఒడిశా భద్రక్ జిల్లా నలియాలో మంగళవారం చోటు చేసుకున్నది. సమాచారం మేరకు.. నలుగురు విద్యార్థులు కలిసి ఈత కొట్టేందుకు నలియా నదికి వెళ్లి నీటమునిగారు. విద్యార్థుల కేకలు విన్న స్థానికులు నది వద్దకు చేరుకొని విద్యార్థులను రక్షించారు. నీటిలో నుంచి బయటకు తీసుకువచ్చి.. అనంతరం వెంటనే భద్రక్‌లోని జిల్లా హెడ్‌క్వార్టర్స్ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు విద్యార్థులు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. ప్రస్తుతం చికిత్స కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.