Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూయార్క్
చంద్రుడి మీదకు నాసా మళ్లీ వ్యోమగాముల్ని పంపనున్నది. వచ్చే ఏడాది నవంబర్‌లో ఆర్టెమిస్-2 లూనార్ రాకెట్ ద్వారా ఆ ఆస్ట్రోనాట్స్ వెళ్లనున్నారు. అయితే ఆ నలుగురు వ్యోమగాముల పేర్లను సోమవారం నాసా ప్రకటించింది. రీడ్ వైజ్మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెర్మీ హాన్సెన్లు చంద్రుడిపైకి వెళ్లనున్నారు. రీడ్, విక్టర్‌లు నాసాకు చెందిన వాళ్లు కాగా, క్రిస్టినా, జెర్మీలు కెనిడియన్ స్పేస్ ఏజెన్సీ వ్యోమగాములు. ఆర్టెమిస్-2 మిషన్‌కు వైజ్మాన్ కమాండర్‌గా సర్వ్ చేయనున్నారు.