Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
భద్రత పెంచాలన్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పిటిషన్ఫై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత తనకు భద్రత 1+1కి తగ్గించారని, 2+2 భద్రత కొనసాగించాలని పిటిషన్లో కోరారు. ఈ తరుణంలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2+2 భద్రత ఇచ్చామని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. రాజగోపాల్రెడ్డి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కావున 1+1 భద్రత ఇస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఇరు వైపులా వాదనలు విన్న హైకోర్టు భద్రత పెంచాలన్న రాజగోపాల్రెడ్డి వినతిని పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. అంతే కాకుండా పది రోజుల్లో దరఖాస్తును పరిష్కరించాలని డీజీపీకి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.