Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహణలో ఉన్న జూనియర్ కళాశాలల్లో ఇంటర్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీఆర్జేసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష - 2023కు ఏప్రిల్ 4 నుంచి 24వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్.నరసింహారావు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశ పరీక్ష హాల్టికెట్లను మే 12 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. మే 20న మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్ష ఉండనుంది. ఈ పరీక్షఫలితాలను జూన్ 8న ప్రకటిస్తారు. అనంతరం ఇంటర్లో కోర్సుల వారీగా సీట్లను భర్తీ చేసేందుకు తొలి విడత కౌన్సిలింగ్ జూన్ 12 నుంచి 16వరకు; జూన్ 19 నుంచి 21వరకు రెండో విడత; జూన్ 26 నుంచి 28వరకు మూడో విడత కౌన్సిలింగ్ జరగనుంది. మరిన్ని వివరాల కోసం వెబ్ సైట్ ని సంప్రదించవచ్చు.. https://aprs.apcfss.in