Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్-16లో ఇవాళ డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. ఈ పోరులో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. టైటాన్స్ ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక మ్యాచ్ ఆడి విజయం నమోదు చేయగా, ఢిల్లీ జట్టు తానాడిన ఒక్క మ్యాచ్ లో ఓటమిపాలైంది. దాంతో ఢిల్లీ జట్టు నేటి మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా బరిలో దిగనుంది. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ జట్టులో రెండు మార్పులు జరిగాయి. ఆన్రిచ్ నోక్యా, పోరెల్ జట్టులోకి వచ్చారు. అటు, టైటాన్స్ జట్టులోనూ పలు మార్పులు జరిగాయి. మోకాలి గాయంతో టోర్నీకి దూరమైన కేన్ విలియమ్సన్ స్థానంలో డేవిడ్ మిల్లర్ ను తుదిజట్టులోకి తీసుకున్నారు. తొలి మ్యాచ్ లో ఏమంత ప్రభావం చూపని విజయ్ శంకర్ స్థానంలో సాయి సుదర్శన్ జట్టులోకి వచ్చాడు.