Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాదు బంజారాహిల్స్ రోడ్ నెం.1లోని నవీన్ నగర్ లో వ్యభిచార దందా బయటపడింది. పలు ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి ఏరోనాటిక్ బ్యూటీ స్పా పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఈ స్పాపై దాడులు చేపట్టి, నిర్వాహకులతో సహా 20 మందిని అదుపులోకి తీసుకుంది. వీరిలో 10 మంది మహిళలు, 10 మంది పురుషులు ఉన్నారు. వీరిని పంజాగుట్ట పోలీసులకు అప్పగించింది. స్పా మాటున అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.