Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోనసీమ: జిల్లాలోని దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ సైకో మహిళలపై వీరంగం సృష్టించాడు. అమలాపురం ఏఎంజి కాలనీ వద్ద సైకో హల్చల్ చేశాడు. ఇద్దరు మహిళలపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ సైకో దాడిలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ ఆ మహిళను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అలాగే ఆ సైకోను పట్టుకున్న గ్రాసమస్తులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.