Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమెరికా
అమెరికా రాజకీయ చరిత్రలో సంచలనం. పోర్న్‌స్టార్‌కు చెల్లింపుల కేసులో ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టయ్యారు. మంగళవారం న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ కోర్టుకు హాజరైన ట్రంప్ ముందుగా డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో లొంగిపోయారు. కోర్టు సిబ్బంది ఆయన వేలిముద్రలు, ఫొటోలు తీసుకున్నారు. దీంతో ట్రంప్‌ను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నట్టు కోర్టు పరిగణించింది. ఆ తర్వాత ట్రంప్ విచారణ ప్రారంభమైంది. కాగా, కోర్టు ట్రంప్‌కు బెయిల్ మంజూరు చేస్తే విచారణ అనంతరం ఆయన వెంటనే విడుదల కానున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో.. స్ట్రామీ డానియల్స్ అనే పోర్న్‌స్టార్‌తో తనకున్న శారీరక సంబంధాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు ఆమెకు డబ్బు ఇచ్చి అనైతిక ఒప్పందం చేసుకున్నారని ట్రంప్ నేరాభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.