Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బ్రస్సెల్స్: నాటో సైనిక కూటమిలో 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ మంగళవారం చేరింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళ రష్యాతో సుదీర్ఘ సరిహద్దు కలిగిన ఫిన్లాండ్ నాటో కూటమిలో చేరడం కీలక పరిణామమని పరిశీలకులు భావిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో సోవియెట్ చేతుల్లో ఓటమి తర్వాత ఫిన్లాండ్ ఏ సైనిక కూటమిలోనూ చేరకుండా తటస్థ వైఖరితో వ్యవహరిస్తున్నది. అయితే, ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత రష్యాతో తమకు కూడా ముప్పు ఉండొచ్చని ఫిన్లాండ్ భావించింది. తన వైఖరి మార్చుకొని నాటో కూటమిలో చేరేందుకు నిర్ణయించుకొని గత మే నెలలో దరఖాస్తు చేసుకుంది.