Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశ రాజధాని ఢిల్లీ మరో భారీ ఆందోళనకు సిద్ధమైంది. బీజేపీ సర్కార్ అవలంబిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు బుధవారం ర్యాలీ చేపట్టనున్నారు. ‘మజ్దూర్-కిసాన్ సంఘర్ష్’ ర్యాలీ పేరుతో చేపడుతున్న ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల నుంచి రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు పెద్దసంఖ్యలో అద్దె వాహనాలు, రైళ్లు, ఇతర మార్గాల ద్వారా ఢిల్లీకి చేరుకొంటున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, వేతనాల తగ్గుదల తదితర సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని రైతు, కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవీ...
1. అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలి.
2. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి.
3. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి.
4. విద్యుత్తు సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి.
5. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి.
6. రోజుకు రూ.600 కూలీతో ఉపాధి హమీ పథకాన్ని 200 రోజులకు విస్తరించాలి.
7. పేద రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలి.
8. అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేయాలి.
9. నెలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి.
10. కార్మికులందరికీ రూ.10 వేల పింఛను ఇవ్వాలి.
11. కాంట్రాక్ట్ లేబర్ వ్యవస్థకు స్వస్తి పలకాలి.
12. కార్పొరేట్ పన్ను పెంచడంతో పాటు సంపద పన్నును ప్రవేశపెట్టాలి.
13. పట్టణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలి.