Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - యాదాద్రి: జిల్లాలోని బొమ్మలరామారాం పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థతి నెలకొంది. అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ గురైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పరామర్శించేందుకు వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌పై పోలీసుల దాష్టీకం ప్రదర్శించారు. మఫ్టీలోనున్న పోలీసులు... రఘునందన్‌ను చొక్కా పట్టి బలవంతంగా లాగి పోలీస్ వాహనం వద్దకు తీసుకెళ్లారు. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కారణం చెప్పాలని రఘునందన్ ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులు, రఘునందన్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మఫ్టీలో ఉంటూ మెడపై చేయి లాగుతూ దురుసుగా ప్రవర్తిస్తారా? అంటూ రఘునందన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అరెస్ట్ ప్రొసీజర్ ఇదేనా? అంటూ బీజేపీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. బండి సంజయ్ అరెస్ట్ విషయంలో డీసీపీని కలిసేందుకు వస్తే అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపడ్డారు.