Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
ఢిల్లీ మహానగరంలో ఎటుచూసినా కార్మికులు, కర్షకులే. సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ సంఘాల సంయుక్త పిలుపు మేరకు మోడీ సర్కారుపై రణనినాదం చేసేందుకు లక్షలాదిగా తరలొచ్చిన ప్రజలతో ఢిల్లీ నగర వీధులు కిక్కిరిసిపోయాయి. కుల, మతాల గోడలు మాకడ్డు కావు...ప్రాంతాలు, భాషా వైషమ్యాలు మాకసలే తెలియవు..మాకు తెలిసిందంతా జీవన పోరాటమే...మా పొట్టగొడితే చూస్తూ ఊరుకోబోమంటూ కార్మికులు, కర్షకులు, కూలీలు పొలికేక పెడుతూ మజ్దూర్, కిసాన్ సంఘర్ష్ మార్చ్ ద్వారా ఐక్యతా రాగం వినిపించనున్నారు. దేశ సంపదను అమ్మేస్తుంటే..కార్పొరేట్ల కోసం కార్మిక చట్టాలను కాలరాస్తుంటే చూస్తూ ఊరుకోబోమని బుధవారం రాంలీలా మైదానంలో లక్షలాది మంది శ్రమజీవులు కదంతొక్కనున్నారు. 13 ప్రధాన డిమాండ్లకు పరిష్కారం చూపాల్సిందేనని పట్టుబట్టనున్నారు. ఈ మార్చ్ నిర్వహణ కోసం ఆరు నెలలుగా దేశవ్యాప్తంగా వేలాది సభలు, సమావేశాలు, జాతాలు, ఇతర ప్రచార కార్యక్రమాన్ని ఆయా సంఘాలు నిర్వహించాయి. కోటి మంది ప్రజలకు ఈ మార్చ్ లక్ష్యాలను వివరించాయి.