Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వాషింగ్టన్
శృంగార తార స్టార్మీ డేనియల్స్‌తో సంబంధం బయటపడకుండా ఉండేందుకు అనైతిక ఆర్థిక ఒప్పందం చేసుకున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకుని న్యూయార్క్ మన్‌హటన్‌లోని కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయనపై నమోదైన నేరాభియోగాలను న్యాయమూర్తి చదివి వినిపించారు. మొత్తం 34 అభియోగాలను ఆయనపై మోపారు. వాటన్నింటిలో తాను దోషిని కాదని న్యాయమూర్తికి ట్రంప్ విన్నవించారు.
ఈ తరుణంలో ఆయన మాట్లాడుతూ అధ్యక్షుడు జో బైడెన్ పై నిప్పులు చెరిగారు. బైడెన్ పాలన దేశానికి నరకంగా మారుతోందని వ్యాఖ్యానించారు. కోర్టులో హాజరైన అనంతరం ట్రంప్ తన మద్దతుదారులతో మాట్లాడారు. అమెరికాలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈ దేశాన్ని ధ్వంసం చేయాలనుకునే వారి నుంచి ధైర్యంగా రక్షించుకోవడమే నేను చేసిన తప్పు. మనం అమెరికా చరిత్రలోనే అత్యంత చీకటి గడియల్లో జీవిస్తున్నాం. ఇప్పటికే ప్రపంచం మనల్ని చూసి నవ్వుతోంది. ఆఫ్గానిస్థాన్ నుంచి బలగాల ఉపసంహరణ, వలసల విషయంలో మన నిర్ణయాలు నవ్వులపాలయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న అతివాద వామపక్షాలు(రాడికల్ లెఫ్ట్) ఎట్టిపరిస్థితుల్లో నన్ను అణచివేయాలని చూస్తున్నారు. అమెరికాను మళ్లీ ఉన్నతంగా మారుస్తాం’ అంటూ డెమోక్రాట్లు, బైడెన్‌పై ఆయన విమర్శలు గుప్పించారు.