Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చెన్నై
జానపద పాటలతో గుర్తింపు తెచ్చుకున్న గాయని రమణి అమ్మాల్(69) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. తమిళ ఇండస్ట్రీకి చెందిన రమణి అమ్మాల్ రాక్‌స్టార్ రమణిగా ఫేమస్ అయ్యారు. భరత్ హీరోగా నటించిన కాదల్ చిత్రంలోని తండట్టి కుప్పాయి పాట రమణికి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఆ పాట సూపర్ హిట్ కావడంతో వరుస అవకాశాలు లభించాయి. 2017లో జీ తమిళ్ సరిగమపలో పాల్గొని మరింత పేరు పోందారు.