Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను బొమ్మల రామారం నుంచి తరలించారు. బీజేపీ కార్యకర్తలు, నేతల ఆందోళన క్రమంలో పోలీసులు ఆయన్ను పాలకుర్తి మీదుగా వర్ధన్నపేట వైపు తీసుకెళ్లారు. అక్కడి నుంచి వరంగల్ వెళ్లి కోర్టులో సంజయ్‌ను హాజరపరచనున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై పోలీసులు స్పష్టత ఇవ్వడం లేదు. మరోవైపు పాలకుర్తి ప్రభుత్వాస్పత్రిలో సంజయ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు.
అయితే పోలీసు స్టేషన్‌కు వచ్చిన బీజేపీ నాయకులు ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గీతా మూర్తితో పాటు పలువురు నాయకులను అరెస్టు చేసి చుట్టు పక్కల ఉన్న పోలీస్ స్టేషన్లకు తరలించారు.