Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: టెన్త్ పేపర్ లీకేజీ తెలంగాణలో ప్రకంపణలు సృష్టిస్తున్నాయి. ఈ కేసులో బండి సంజయ్‌ను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీ కార్యాలయానికి వస్తుండగా హకీంపేటలో పోలీసులు అరెస్టు చేశారు. బండి సంజయ్‌ను పరామర్శించేందుకు వెళుతున్న నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య వస్తుందని అందుకే అరెస్టు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఎక్కడికక్కడ బీజేపీ నేతల అరెస్టులు, గృహనిర్భందాలు కొనసాగుతున్నాయి.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసులు కుట్ర కేసు నమోదు చేసి బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ నుంచి భువనగిరి కోర్టుకు తరలించారు. సంజయ్ కనిపించకుండా కారు అద్దాలకు పేపర్లు అడ్డు పెట్టారు. బండిని తరలిస్తుండగా కారును అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు.