Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం ఆడుతోందని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి పిల్లలతో క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. దమ్ముంటే రాజకీయంగా కొట్లాడాలి కానీ పిల్లల జీవితాలతో బీజేపీ పార్టీ చెలగాటం ఆడుతోందని అసహనం వ్యక్తం చేశారు. పట్టపగలు బండి సంజయ్, బీజేపీ పార్టీ దొరికిపోయాయని హరీశ్ రావు అన్నారు.
స్పష్టంగా దొరికిపోయినప్పటికీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. పిల్లల జీవితాలను తాకట్టు పెట్టి రాజకీయాలు అవసరమా అని బీజేపీ నేతలపై మండిపడ్డారు. మధ్యాహ్నం ఏమో పేపర్ లీకైందని బీజేపీ నాయకులు ధర్నా చేసిన్రు సాయంత్రం ఏమో పేపర్ లీకేజీకి బాధ్యులు అరెస్టయిన వారిని విడుదల చేయాలని అదే బీజేపీ ధర్నా చేసిందని అన్నారు. దీన్ని బట్టి అరెస్టు అయ్యింది పక్కా బీజేపీ దొంగ.. బీజేపీ నాయకుడు.. బీజేపీ కార్యకర్త అని అర్థమవుతోందని అన్నారు. ‘ బీజేపీ అంటేనే ఒక విద్వేషం.. ఒక విచ్ఛిన్నం చేసే కుట్ర, విధ్వంసం చేసే కుట్ర అని మంత్రి హరీశ్ రావు అన్నారు.