Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిక్కిం
నాథులా ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ హిమపాతానికి మంచు చరియల కింద ఏడుగురు సజీవ సమాధి అయ్యారు. మంగళవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో పర్యాటకుల వాహనాలు వెళుతుండగా ఒక్కసారిగా హిమపాతం వచ్చింది. టన్నుల కొద్దీ హిమపాతం వారి వాహనాలను కప్పేసింది. దీంతో 30 మంది మంచు కింద చిక్కుకుపోయారు. ఈ తరుణంలో సైనిక, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి 23 మందిని రక్షించారు. ఏడు మృతదేహాలను వెలికి తీశారు. గాయపడిన 13 మంది పర్యాటకులను గ్యాంగ్ టక్ లోని ఎస్టీఎన్ఎం హాస్పిటల్ కు తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత తొమ్మిది మందిని ఇంటికి పంపించారు.