Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బెంగళూరు మెట్రో వైట్‌ఫీల్డ్ లైన్లో కొత్తగా ప్రారంభించిన నల్లూర్‌హళ్లి స్టేషన్ మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో నగరాన్ని అతలాకుతలం చేసింది. ప్లాట్‌ఫారమ్‌పై టికెటింగ్ కౌంటర్ దగ్గర వరద నీరు చేరింది. ఈ మెట్రో స్టేషన్‌ను ప్రధాని మోడీ రెండు రోజుల క్రితమే ప్రారంభించారు. వరద నీటిలో మునిగిన మెట్రో స్టేషన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలా మంది ట్విటర్ వినియోగదారులు నల్లూరుహళ్లి మెట్రో స్టేషన్‌ను వరదలు ముంచెత్తడంతో చిత్రాలు, వీడియోలు పోస్ట్ చేశారు. అసంతృప్తులైన పలువురు ప్రయాణికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో వ్యవస్థ వినియోగానికి సిద్ధంగా ఉందా అని ప్రశ్నించారు. పనులను సరిగ్గా పూర్తి చేయకుండానే హడావుడిగా మెట్రో స్టేషన్లు ప్రారంభించారని విమర్శలు గుప్పించారు. బెంగళూరు మెట్రోలో 13.71 కిలోమీటర్ల ఫేజ్ IIను రెండు రోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. వైట్‌ఫీల్డ్ (కడుగోడి) నుంచి కృష్ణరాజపురం వరకు కొత్త మెట్రో లైన్‌ను శనివారం ప్రధాని ప్రారంభించారు. ఈ మెట్రో లైన్ రూ. 4,249 కోట్లతో నిర్మించబడింది. మార్చిలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన కర్ణాటకలోని బెంగళూరు-మైసూరు హైవే కేవలం ఆరు రోజుల తర్వాత రాష్ట్రంలోని రామనగర ప్రాంతంలో భారీ వర్షాల తర్వాత జలమయమైంది.