Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ తో తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కరీంనగర్ లోని తన ఇంటిలో బండి సంజయ్ ఉన్న సమయంలో పోలీసులు ప్రవేశించి అర్ధరాత్రి ఆయనను బలవంతంగా తీసుకువెళ్లి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కి బండి సంజయ్ ని తరలించారు. అనంతరం ఈరోజు మధ్యాహ్నం హనుమకొండ కోర్టుకి తరలించారు. హనుమకొండ మెజిస్ట్రేట్ ముందు బండి సంజయ్ ని హాజరు పరిచనున్నారు పోలీసులు. అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనల నేపథ్యంలో కోర్టు పరిసరాలలో భారీగా పోలీసులు మోహరించారు. అయితే ఆయనను పోలీసు వాహనంలో కోర్టుకు తీసుకువచ్చే క్రమంలో పోలీస్ కారుపై బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పులు విసిరారు. బండి సంజయ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.