Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : స్టార్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ ఐపీఎల్ 16వసీజన్‌కు పూర్తిగా దూరమైన విషయం తెలిసిందే. దీంతో అతడి స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ మరో కీలక ఆటగాడిని తీసుకుంది. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జేసన్ రాయ్‌కు రూ. 2.8 కోట్లను ఆఫర్ చేసి సొంతం చేసుకుంది. ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ రూపంలో కీలక బ్యాటర్ కేకేఆర్‌కు దూరం కాగా.. బ్యాటింగ్ ఆర్డర్లో జాసన్ రాయ్ చేరడం తప్పకుండా ఆ జట్టుకు సానుకూలాంశంగా మారుతుంది. షకిబ్ స్థానంలో రాయ్‌కు అవకాశం కల్పించిన ఫ్రాంచైజీ.. శ్రేయస్ అయ్యర్‌కు రిప్లేస్‌మెంట్‌పై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. నితీశ్ రాణా నాయకత్వంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆడిన ఒక్క మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలైంది. తన తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 6న కోల్‌కతా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన జేసన్ రాయ్ 5 మ్యాచుల్లో 150 పరుగులు మాత్రమే చేశాడు. గతేడాది డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించినప్పటికీ బయెబబుల్ వాతావరణంలో ఆడలేనని ఇంటికే పరిమితమయ్యాడు.