Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : రవితేజ కథానాయకుడిగా 'రావణాసుర' సినిమా రూపొందింది. ఈ సినిమాలో ఆయన క్రిమినల్ లాయర్ గా కనిపించనున్నారు. అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. అనూ ఇమ్మాన్యుయేల్ .. మేఘ ఆకాశ్ .. ఫరియా అబ్దుల్లా .. దక్ష నగార్కర్ .. పూజిత్ పొన్నాడ కథానాయికలుగా అలరించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ థీమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. రావణా .. రావణా .. రావణా .. దశగ్రీవ .. రావణా అంటూ ఈ పాట సాగుతోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలోని ఈ పాటకి శ్రీహర్ష సాహిత్యాన్ని అందించగా అరుణ్ కౌండిన్య ఆలపించారు. ఈ సినిమాలోని ఐదుగురు హీరోయిన్స్ లో ప్రధానమైన నాయిక ఎవరు? హీరో పాత్రకే నెగెటివ్ షేడ్స్ ఉంటే .. అసలు విలన్ ఎవరు? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ సందేహాలకు ఈ సినిమా మాత్రమే సమాధానం చెబుతుందనేది మేకర్స్ మాట. ఈ నెల 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.