Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ : టెన్త్ హిందీ పేపర్ లీకేజీలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ కార్యకర్త ప్రశాంత్ కీలకంగా వ్యవహరించారని వరంగల్ సీపీ రంగనాథ్ పేర్కొన్నారు. వీరిద్దరి సోమవారం సాయంత్రం నుంచే వాట్సాప్ చాటింగ్, వాట్సాప్ కాల్స్ తరుచూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాతే హిందీ పేపర్ లీకేజీకి కుట్ర చేశారని సీపీ తెలిపారు. ఈ కేసులో బండి సంజయ్‌ను కోర్టులో హాజరుపరిచామని సీపీ పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్టులో బండి సంజయ్‌ను ఏ1గా, ఏ2గా ప్రశాంత్‌ను చేర్చినట్లు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. బూర ప్రశాంత్‌ను నిన్న అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. హిందీ ప్రశ్నపత్రం కమలాపూర్ బాయ్స్ స్కూల్ నుంచి బయటకు వచ్చిందని సీపీ స్పష్టం చేశారు. మొదటగా ఉదయం 11:18 గంటలకు ప్రశాంత్ ప్రశ్నపత్రాన్ని ఫోటో తీసి వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ చేశారు. 11:24 గంటలకు బండి సంజయ్‌కు ఫార్వార్డ్ చేశారు. తర్వాత చాలా మందికి ఫార్వార్డ్ అయింది పేపర్. ప్రశాంత్‌తో పాటు మహేశ్ కూడా చాలా మందికి పంపించారు. ఈటల రాజేందర్ కూడా పంపించారు. వాట్సాప్‌లో ప్రశ్నపత్రాన్ని ఫార్వార్డ్ చేసిన తర్వాత ప్రశాంత్ 149 మందికి కాల్ చేసినట్లు సీపీ స్పష్టం చేశారు.