Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తుపాకీతో తనపై కాల్పులు జరిపే ప్రయత్నం చేసిన ఒక నిందితుడిని హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి పట్టుకున్నారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. డిప్యూటీ కమిషనర్ హరేంద్ర సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి ఇద్దరు పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. 9 గంటల సమయంలో మచ్చి చౌక్ సమీపంలోని నీలోతి ప్రాంతంలో మోటర్ సైకిల్‌పై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. అనుమానించిన పోలీసులు వారి వద్దకు వెళుతుండగా.. వీరిని చూసిన వ్యక్తులు పారిపోయే ప్రయత్నంలో బైక్ నుంచి కింద పడిపోయారు. దాన్ని అక్కడే వదిలే పారిపోతుండగా పోలీసులు వారిని వెంబడించారు. వారిలో ఒకరు పరారయ్యాడు. మరో ధ్యాన్‌చంద్ అనే వ్యక్తని వెంబడించగా అతను తన వద్ద ఉన్న తుపాకీని చూపి హెడ్ కానిస్టేబుల్ మనోజ్‌ను బెదిరించాడు. కాల్పులు జరపాలని చూసిన నిందితుడిపై అధికారి ఒక్కసారిగా దూకి గట్టిగా పట్టుకున్నారు. ఇదంతా గమనించిన స్థానికులు పోలీసుకు సాయం చేశారు. అంతా కలిసి నిందితుడికి దేహ శుద్ధి చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. గతంలో ఈ ఇద్దరిపై హత్య, దోపిడీ కేసులు నమోదయ్యాయని.. గతేడాది బెయిల్‌పై విడుదలయ్యారు. వీరు చిన్నచిన్న నేరాలు చేస్తూ తిరుగుతున్నారని హరేంద్ర సింగ్ తెలిపారు.