Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎండ దంచికొట్టిన సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. అటు రాష్ట్రంలో రానున్న మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు చోట్ల వడగండ్ల వానలు పడే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది. ఛత్తీస్గఢ్,లోని మధ్య భాగాల నుండి విదర్భ ,తెలంగాణ ,ఇంటీరియర్ కర్ణాటక రాష్ట్రం మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ సగటు సముద్రమట్టానికి 0.9కి.మి ఎత్తున ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు , మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 40కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది.