Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మంగళవారం అర్ధరాత్రి అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను హన్మకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ అనిత రావుల ముందు హాజరుపరిచారు పోలీసులు. బండి సంజయ్‌తో పాటు ప్రశాంత్, శివ గణేష్, మహయ్లను కూడా మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లారు. వాదనలు విన్న మెజిస్ట్రేట్ బండికి 14 రోజుల రిమాండ్ విధించారు. అంతకుముందు ముందుజాగ్రత్త చర్యగా హన్మకొండ కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే బండిని కోర్టు నుంచి మెజిస్ట్రేట్ ఇంటి వద్దకు తీసుకెళ్తుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. బండి అరెస్టును నిరసిస్తూ వారు పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో ఇరవర్గాల మధ్య తోపులాటలు జరిగాయి.