Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నాని - కీర్తి సురేశ్ కాంబినేషన్లో రూపొందిన 'దసరా' సినిమా క్రితం నెల 30వ తేదీన థియేటర్లకు వచ్చింది. సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో ఈ కథను శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా, 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ నేపథ్యంలో 'కరీంనగర్'లో .. భారీగా తరలివచ్చిన అభిమానుల సమక్షంలో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. ఈ స్టేజ్ పై దీక్షిత్ శెట్టితో కలిసి నాని మాస స్టెప్పులు వేశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించినందుకు శ్రీకాంత్ ఓదెలకి నిర్మాత సుధాకర్ చెరుకూరి 'బీఎమ్ డబ్ల్యూ' కారును గిఫ్ట్ గా ఇస్తున్నట్టుగా సుమ ప్రకటించింది. అందుకు సంబంధించిన 'కీ'ని ఆయన శ్రీకాంత్ కి ఈ స్టేజ్ పై అందజేశాడు. ఆ సమయంలో స్టేజ్ ఉన్న మిగతా వాళ్లంతా తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.