Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : గువాహటి వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతోన్న మ్యాచ్ లో కింగ్స్ లెవన్ పంజాబ్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ జట్టుకు ఓపెనర్లు శిఖర్ ధావన్ (86 నాటౌట్), ప్రభ్‌సిమ్రన్ (60)మంచి శుభారంభాన్ని ఇచ్చారు. వరుసగా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇద్దరు కలిసి మొదటి వికెట్ కు 90 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరిని 9వ ఓవర్లో హోల్డర్ వీడదీశాడు. భారీ షాట్‌కు ప్రయత్ని్ంచిన ప్రభ్‌సిమ్రన్( (60) ) లాంగ్‌ఆఫ్ లో జోస్ బట్లర్ అద్భుతమైన క్యాచ్ కు దొరకిపోయాడు. ఆ తరువాత జితేశ్ శర్మ(27) తో మరో ఓపెనర్ ధావన్ ఇన్నింగ్స్ ను దూకుడుగా నడిపించాడు. ఈ క్రమంలో ధావన్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. అయితే వీరిని చాహల్ విడదీశాడు. అతని బౌలింగ్‌లో జితేశ్ శర్మ భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాఫ్‌లో రియాన్ పరాగ్ చేతికి చిక్కాడు. దీంతో 158 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో పంజాబ్ మరో రెండు వికెట్లను కోల్పోయింది. సికిందర్ రజా (1), షారుఖ్ ఖాన్ (6) త్వరగానే ఔటయ్యారు. ఇన్ని్ంగ్స్ చివరివరకు క్రీజ్‌లో ఉన్న ధావన్ జట్టుకు భారీ స్కోర్ ను అందించాడు. రాజస్థాన్ బౌలర్లలో జాసన్ హోల్డర్ రెండు వికెట్లు తీయగా, అశ్విన్, చాహల్ చెరో వికెట్ తీశారు.