Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. బుధవారం ఒక్కరోజే హైదరాబాద్లో తులం పసిడి రేటు ఏకంగా రూ.1,030 ఎగబాకింది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా 24 క్యారెట్ (మేలిమి) పుత్తడి విలువ రూ.61,360ని తాకింది. 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ (ఆభరణాల బంగారం) కూడా రూ.950 ఎగిసి ఆల్టైమ్ హై రికార్డును సృష్టిస్తూ రూ.56,250ని చేరింది. మంగళవారం సైతం తులం 24 క్యారెట్ బంగారం ధర రూ.660, 22 క్యారెట్ రూ.600 పుంజుకున్న విషయం తెలిసిందే